వీపనగండ్ల ఊర చెరువులో సంచరిస్తున్న మొసలి
అక్షరవిజేత,వీపనగండ్ల :
వీపనగండ్ల మండల కేంద్రంలో ఊరు చివరలో ఉన్నటువంటి ఊర చెరువులో మొసలి సంచరించడంతో గ్రామంలో కలకలం రేపింది. బండపై పడుకోవడం గ్రామస్తులు సాకలి నాగయ్య,సాకలి సాయి,సాకలి దేవమ్మ తదితరులు గుర్తించి వెంటనే విలేకరులకు సమాచారం ఇచ్చారు.చెరువులో తిరుగుతూ ఒక బండపై కనబడడంతో చెరువులోకి వెళ్ళినటువంటి గ్రామస్తులు భయాందోళనకు గురి చెందారు. కాబట్టి ఊర చెరువులోకి సాయంకాలం సమయంలో మూగజీవులను శుభ్రం చేయడానికి తీసుకెళ్ల అటువంటి గ్రామస్తులు, చేపల వేటకు వెళ్లేటువంటి మత్స్య కార్మికులు జాగ్రత్తలు తీసుకోగలరు.